Police Seized Ganja In Badrachalam : సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు అక్రమార్కులు గంజాయి రవాణాను వ్యాపారంగా అలవాటు చేసుకుంటున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా గంజాయి రవాణాకు వివిధ మార్గాలను వెతుకుతున్నారు. నిన్నటి వరకు పుష్ప సినిమాని అనుసరించిన గంజాయి అక్రమార్కులు రోజురోజుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.
తాజాగా భద్రాచలంలో దేవుడి ప్రచార రథంలో గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే పోలీసులకు అనుమానం రాకుండా ఉండటానికి ఒక ట్రాలీ ఆటోను దేవుడి ప్రచార రథంలా తయారు చేసి అందులో ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేశారు. కాషాయ వ్రస్తాలు ధరించి, వాహనంలో దేవతామూర్తుల విగ్రహాలతో ఒకరు స్వామీజీ గా మిగతా వారు భక్తులుగా వేషధారణ చేసి తిరుగుతూ భిక్షాటన ద్వారా జీవనం సాగిస్తున్నట్లు నమ్మిస్తూ గంజాయి రవాణా చేస్తున్నారు.
సంగారెడ్డిలో రూ.3 కోట్ల విలువ గల గంజాయి పట్టివేత
Police Busted Ganja Smuggling Gang at Bhadrachalam: ఇలా అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులుభద్రాచలం పోలీసులకు అడ్డంగా దొరికారు. ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాలతో భద్రాచలం ఎస్సై విజయలక్ష్మి సిబ్బందితో బ్రిడ్జి సెంటర్‌లో వాహనాలను తనిఖీ చేస్తుండగా దేవుని ప్రచారం చేస్తున్నట్లుగా వచ్చిన ఓ ఆటోను తనిఖీ చేశారు. అందులో ప్యాకెట్లలో ఉన్న 484 కిలోల గంజాయిని గుర్తించారు. వీటిని తెస్తున్న హరియాణాకు చెందిన మున్షిరాం, భగత, గోవింద్‌ను అరెస్టు చేశారు.