కొత్తగూడెం బర్లిఫీట్‌కు చెందిన రాధిక(24)కు శుక్రవారం అర్ధరాత్రి పురిటినొప్పులు వచ్చాయి. ఆ సమయంలో ఏం చేయాలో తోచక... ఓ స్థానికురాలు ఒకటో పట్టణ సీఐ రాజుకు విషయాన్ని ఫోన్‌లో వివరించారు. వెంటనే స్పందించిన సీఐ... ఎస్సై తిరుపతితో పాటు ఇద్దరు సిబ్బందిని ఘటనా స్థలికి పంపించారు.
మేమున్నామనీ.. మీకేం కాదని.. - LOCK DOWN PROBLEMS
అసలే లాక్డౌన్... అందులో అర్ధరాత్రి... ఇంతటి విపత్కర పరిస్థితిలో ఓ గర్బిణీకి పురిటి నొప్పులొచ్చాయి. ఎటూ పోలేని పరిస్థితి... ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఆదుకున్నారు. ఆస్పత్రిలో చేర్చి తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడారు పోలీసులు.
మేమున్నామనీ.. మీకేం కాదని..
పోలీస్ వాహనంలో రాధికను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. తెల్లవారుజామున ఆడ శిశువుకు రాధిక జన్మనిచ్చింది. తల్లీబిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.