భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో హరితహారం నిర్వహించారు. ఐటీడీఏ పీవో గౌతమ్ ముఖ్యఅతిథిగా హాజరై గ్రీన్ భద్రాద్రి సంస్థ అందించిన మొక్కలు నాటారు. ప్రాణులకు మొక్కలే జీవనాధారమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో పట్టణంలో మొక్కలు నాటనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రాణులకు మొక్కలే జీవానాధారం: ఐటీడీఏ పీవో - badradri
భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో హరితహారం నిర్వహించారు. ఐటీడీఏ పీవో గౌతమ్ పాల్గొని మొక్కలు నాటారు.
హరితహారం