భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం వేగంగా పెరుగుతోంది. గోదావరిలో నీటి మట్టం 44 అడుగులకు పెరగడం వల్ల అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇవాళ ఉదయం 6 గంటలకు 43 అడుగుల వద్ద ఉన్న ప్రవాహం.. ప్రస్తుతం గోదావరిలో 46.30 నీటిమట్టం అడుగులకు చేరింది. గోదావరిలో 11,34,957 క్యూసెక్కుల ప్రవాహం ఉంది.
Godavari: భద్రాచలం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక - గోదావరిలో పెరుగుతున్న నీటి మట్టం
ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలంలో గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
నది వద్ద స్నానాలఘట్టం వరద నీటిలో మునిగిపోయింది. కల్యాణ కట్ట భవనం వరకు వరద నీరు చేరింది. వరద ఉద్ధృతి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి.. ప్రజలకు, ఉన్నతాధికారులకు తెలపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎగువ నుంచి వస్తున్న నీటికి దిగువ ప్రాంతంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తోడై ప్రవాహ ఉద్ధృతి పెరుగుతోంది. నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:Reservoirs: రాష్ట్రంలో భారీ వర్షాలు... నిండుతున్న జలాశయాలు