తెలంగాణ

telangana

ETV Bharat / state

3 లక్షల మొక్కల పంపిణీ కోసం కృషి చేస్తున్న నర్సరీలు

పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం కృషి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని గ్రామాలకు 3 లక్షల మొక్కలు పంచాలనుకున్న అధికారులు నర్సరీలు సిద్ధం చేస్తున్నారు.

OFFECERS AND LEADERS ARE HARD WORKING TO REACH 3 LAKHS PLANTS TARGET
3 లక్షల మొక్కల పంపిణీ కోసం కృషి చేస్తున్న నర్సరీలు

By

Published : Apr 16, 2020, 6:51 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని 29 పంచాయతీలకు 3లక్షల 7 వేల 500 మొక్కలు అందించే లక్ష్యంతో అధికారులు నర్సరీలను ఏర్పాటు చేశారు. 12 వేల మొక్కల పరిమితితో 19 గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి... అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

నర్సరీలలో మొక్కలను శ్రద్ధగా పెంచే విధంగా సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. పంచాయతీలలో నర్సరీలను మండల అభివృద్ధి అధికారి వివేక్​రామ్​, పంచాయతీ అధికారి అరుణ్ గౌడ్, ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. టేకు, నిమ్మ, ఉసిరి, జామ, అడవి తంగేడు, బొప్పాయి మొక్కలతో పాటు పోలవరం పంచాయతీలో వినూత్నంగా దానిమ్మ, కమల మొక్కలను పెంచుతున్నారు.

3 లక్షల మొక్కల పంపిణీ కోసం కృషి చేస్తున్న నర్సరీలు
3 లక్షల మొక్కల పంపిణీ కోసం కృషి చేస్తున్న నర్సరీలు
3 లక్షల మొక్కల పంపిణీ కోసం కృషి చేస్తున్న నర్సరీలు
3 లక్షల మొక్కల పంపిణీ కోసం కృషి చేస్తున్న నర్సరీలు
3 లక్షల మొక్కల పంపిణీ కోసం కృషి చేస్తున్న నర్సరీలు
3 లక్షల మొక్కల పంపిణీ కోసం కృషి చేస్తున్న నర్సరీలు

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details