భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఏటా అనేక ఉత్సవాలు జరుగుతుంటాయి. ముఖ్యమైనవి... శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి. ఈ నెల 15 నుంచి జనవరి 4 వరకు శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. ఈ వేడుకల్లో స్వామివారు రోజుకో అవతారంలో దర్శనమిస్తారు. ఈ నెల 24న లక్ష్మణ సమేత సీతారాములకు గోదావరి నదిలో తెప్పోత్సవం, 25న వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించాల్సి ఉంది. వేడుకల్లో భాగంగా... తెప్పోత్సవాన్ని ఆలయం లోపల కొలను ఏర్పాటు చేసి నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సారి నిరాడంబంరంగానే ముక్కోటి ఏకాదశి వేడుకలు..!
అది భారతదేశంలోనే రెండో అయోధ్యగా పేరు గాంచిన పుణ్యక్షేత్రం. రోజూ వేలాది మంది భక్తులు అక్కడికి వస్తుంటారు. స్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. అలాంటి ఆలయంలో ఈ నెల 25న నిర్వహించే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలపై చిన్నచూపు చూపిస్తూ... నిరాడంబరంగా జరిపేందుకు యోచిస్తున్నారు.
ఏటా వేలాది మంది దర్శించుకుంటారు. కరోనాతో భక్తుల రాకపోవడం వల్ల... ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించలేకపోతున్నామని అధికారులు అంటున్నారు. చాలామంది ఒకే దగ్గర గుమికూడటం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. కోలాటాలు, వేదమంత్రాలు నడుమ తిరువీధుల్లో భక్తులకు దర్శనం కల్పిస్తారు. కానీ ఈసారి చిత్రకూట మండపంలోనే స్వామివారికి అవతారాలు ఉంటాయని ఆలయ వైదిక కమిటీ తేల్చి చెప్పింది. ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి పరిమిత సంఖ్యలో అనుమతించడం పట్ల స్థానిక భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:రజనీ వెనకున్న ఆ 'రాజకీయ శక్తులు' ఎవరు?