భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 62 పోలింగ్ కేంద్రాల సిబ్బందిని సమాయత్తం చేశారు. కలెక్టర్ ఎం.వి.రెడ్డి ఆధ్వర్యంలో పోలింగ్ సామాగ్రి, సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రక్రియను చేపట్టారు. అందుకు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేశారు.
ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు పయనమైన సిబ్బంది - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 62 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక జరగనుంది. అందుకు సంబంధించిన సామాగ్రిని తీసుకొని సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు పయనమయ్యారు.
ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు పయనమైన సిబ్బంది
ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను నేరుగా నల్గొండకు తరలించనున్నారు. ఎన్నికల సామాగ్రితో సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు పయనమయ్యారు.
ఇదీ చదవండి:ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలి: ఉత్తమ్