తెలంగాణ

telangana

ETV Bharat / state

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రేగ కాంతారావు - ఎమ్మెల్యే రేగ కాంతారావు తాజా వార్తలు

కడుపునొప్పితో బాధ పడుతోన్న మహిళను తన వాహనంలో ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్యే రేగ కాంతరావు మానవత్వాన్ని చాటుకున్నారు. భద్రాచలం వంతెనపై ఆర్టీసీ బస్సు ఆగిపోవడంతో అక్కడికి చేరుకున్న ఆయన అనారోగ్యంతో ఉన్న మహిళను ఆసుపత్రికి పంపించారు.

MLA Rega Kantha Rao expressed humanity
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రేగ కాంతారావు

By

Published : Apr 10, 2021, 8:08 PM IST

ప్రభుత్వ విప్​, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు మానవత్వాన్ని చాటుకున్నారు. భద్రాచలం బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు ఆగిపోవడంతో సుమారు గంట సేపు ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో బస్సులో ఓ మహిళ కడుపునోప్పితో బాధ పడుతుండడాన్ని గమనించిన ఎమ్మెల్యే ఆమెను తన వాహనంలో పాల్వంచ ఆసుపత్రికి పంపించారు.

విజయవాడ నుంచి భద్రాచలం వైపుకు వస్తున్న ఆర్టీసీ బస్సు గోదావరి నది వంతెనపై అకస్మాత్తుగా ఆగిపోయింది. బస్సు ఎంతసేపటికీ స్టార్ట్ కాకపోవడంతో గంట సేపు ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పినపాక ఎమ్మెల్యే బస్సులో ఓ మహిళ కడుపునొప్పితో ఇబ్బంది పడటాన్ని గమనించారు. చికిత్స కోసం ఆమెను తన వాహనంలో పాల్వంచలోని ఆసుపత్రికి తరలించారు. వంతెన పక్కనే భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ ఉన్నప్పటికీ.. తమకు ఎలాంటి సమాచారం రాలేదని ఆర్టీసీ డీఎం చెప్పడం గమనార్హం.

ఇదీ చదవండి:ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. పదిమందికి తీవ్రగాయాలు!

ABOUT THE AUTHOR

...view details