భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. సహకార సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతులు పంటను అమ్ముకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు.
జూలూరుపాడులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
జూలూరుపాడు సహకార సంఘం కార్యాలయంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
జూలూరుపాడులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. లాక్డౌన్ వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బొర్ర రాజశేఖర్, సహకార సంఘం ఛైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఇవీచూడండి:మార్కెట్లో చిరుతిళ్లు, డైపర్ల, శానిటరీ నాప్కిన్లు కొరత