హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇల్లందు పట్టణ ప్రధాన రహదారి వెంట రెండు వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే హరిప్రియ ప్రారంభించారు. ప్రధాన రహదారుల వెంట నాటే మొక్కలతో పట్టణం సుందరంగా మారుతుందని తెలిపారు.
'ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి.. ప్రతిమొక్కనూ బతికించుకోవాలి'
కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రధాన రహదారులకు ఇరువైపులా రెండువేల మొక్కలు నాటడానికి ఎమ్మెల్యే హరిప్రియ శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి బాధ్యతగా వాటిని సంరక్షించాలని ఆమె కోరారు.
విధిగా మొక్కలు నాటి.. బాధ్యతగా సంరక్షించాలి: ఎమ్మెల్యే హరిప్రియ
పట్టణంలోని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని.. వాటిని బాధ్యతగా పెంచేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఈ కొండలరావు పాల్గొన్నారు.