తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర మంత్రులు సత్యవతి, పువ్వాడల భద్రాచలం పర్యటన రద్దు.. - ministers visit to Bhadrachalam

రాష్ట్ర మంత్రులు సత్యవతి రాఠోడ్, పువ్వాడ అజయ్ కుమార్​ల భద్రాచలం పర్యటన రద్దయింది. సీఎం కేసీఆర్​.. రాష్ట్ర మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం వల్ల పర్యటన అకస్మాత్తుగా ఆగిపోయింది. అట్టహాసంగా చేసిన ఏర్పాట్ల వల్ల దాదాపు రూ.4 లక్షలు వృధా ఖర్చయిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Ministers Satyavati and Puvadala cancel Bhadrachalam visit
రాష్ట్ర మంత్రులు సత్యవతి, పువ్వాడల భద్రాచలం పర్యటన రద్దు..

By

Published : Nov 12, 2020, 1:50 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రైతు వేదిక భవనం, పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించేందుకు గురువారం రోజు రాష్ట్ర మంత్రులు సత్యవతి రాఠోడ్, పువ్వాడ అజయ్ కుమార్​ల షెడ్యూల్ ఏర్పాటయింది. మంత్రులు రానున్నందున ఐటీడీఏ పీవో గౌతమ్.. జూనియర్ కళాశాల మైదానంలో అట్టహాసంగా ఏర్పాటు చేశారు. లైటింగ్, మైకులు, టెంట్లు అన్ని ఏర్పాటు చేశాక.. అకస్మాత్తుగా మంత్రుల పర్యటన రద్దయింది.

ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్ర మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినందున మంత్రుల పర్యటనలు అకస్మాత్తుగా ఆగిపోయాయి. భద్రాచలంలో మంత్రుల పర్యటనకు చేసిన ఏర్పాట్లతో సుమారు రూ.4 లక్షలు వృధా అయినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details