రైతులు పండించిన ప్రత్తి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. అన్నదాతలు ఆందోళనపడోద్దని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని ఎంపీ నామ నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి - ధాన్యం కొనుగోలు కేంద్రం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మంత్రి పువ్వాడ, ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రారంభించారు. రైతలు వద్ద నుంచి ప్రభుత్వమే పంట కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దని కోరారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి
ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని తెలిపారు. రైతుల వద్ద నుంచి ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:కరోనా ఉన్మాదం: దుకాణంలో సరకులను నాలుకతో...