కరోనా అనుమానంతో అంత్యక్రియలకు సైతం ఎవరూ రాని పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నాగారంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లాది వెంకయ్యకు గుండెపోటు రావటం వల్ల ఆటోలో వైద్యశాలకు తీసుకెళ్లగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గ్రామ ప్రజలంతా కరోనా వ్యాధి సోకిందని భయభ్రాంతులకు గురయ్యారు.
కుటంబసభ్యుల భయం... వైద్య సిబ్బందే అంత్యక్రియలు చేసిన వైనం
భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం నాగారంలో ఓ మృతదేహానికి వైద్య సిబ్బందే అంత్యక్రియలు చేసిన ఘటన చోటుచేసుకుంది. కరోనాతో చనిపోయాడన్న అనుమానంతో మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాకపోవటం ఒక ఎత్తైతే... కుటుంబసభ్యులు సైతం భయపడటం మరో ఎత్తు.
medical staff done cremations corona patient in badradri kothagudem
కుటుంబ సభ్యులు సైతం భయపడటం వల్ల మృతదేహానికి వైద్య సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. మృతదేహాన్ని తరలించేందుకు వాహనం కోసం ఎవరిని బతిమాలినా రాని పరిస్థితి ఏర్పడటం వల్ల గ్రామానికి చెందిన రైతు రంజిత్ కుమార్ స్పందించి పొలం పనుల్లో ఉన్న ట్రాక్టర్ను నేరుగా తీసుకువచ్చారు. పంచాయతీ అధికారులు సైతం ముందుకు రాని పరిస్థితుల్లో రంజిత్ కుమార్ చేసిన సాయాన్ని అందరూ అభినందించారు.