భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని స్నేహా గార్డెన్లో భాజపా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన మధుసూదన్ రెడ్డి నియోజక వర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు స్థాయిని పెంచాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఐదు బూతులకు ఒక నాయకుడు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. పార్టీ సభ్యత్వం పెంచడంలో బూత్ స్థాయి నాయకుడి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో భాజపా జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ సభ్యత్వ నమోదు స్థాయిని పెంచాలి: మధుసూదన్ రెడ్డి - increase
నియోజక వర్గంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు స్థాయిని పెంచాలని భాజపా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
పార్టీ సభ్యత్వ నమోదు స్థాయిని పెంచాలి: మధుసూదన్ రెడ్డి