భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో గోదావరి లోయ బొగ్గుగని కార్మికుల సంఘం నాయకులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఐదు బ్లాకుల్లోని బొగ్గు గనులను ప్రైవేటీకరించాలన్న ఆలోచనను విరమించుకోవాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు లక్ష్మీ నారాయణ అన్నారు.
‘బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి’
బొగ్గు గనులను ప్రైవేటికరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందన్న సాకు చూపి.. బొగ్గు గనులను ప్రైవేటీకరించాలన్న కేంద్రం ఆలోచన గని కార్మికుల పొట్ట కొట్టడమే అని విమర్శించారు. కేంద్రం తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు.
ఇల్లందులోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేంద్రం బొగ్గు గనుల ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సింగరేణి బొగ్గు సంస్థకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. బొగ్గు గనుల్లో 70 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను పెంచుతున్నట్టు తీసుకున్న నిర్ణయం గని కార్మికుల ఉపాధి మీద దెబ్బ కొట్టడమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే.. దశల వారీగా ఆందోళన చేస్తామని.. తీరు మార్చుకోకపోతే.. ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:'మీ అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం'