జవాన్ల స్వచ్ఛభారత్ - భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి
సంఘ విద్రోహక శక్తులనే కాదు..సంఘంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు జవాన్లు. భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో జవాన్ల స్వచ్ఛభారత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సీఆర్పీఎఫ్ జవాన్లు స్వచ్ఛభారత్‌లో పాల్గొన్నారు. ఎటపాకలోని 212 బెటాలియన్‌కు చెందిన 40 మంది జవాన్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని శుభ్రం చేశారు. డిప్యూటీ కమాండెంట్ రంజిత్ ఆధ్వర్యంలో చెత్తాచెదారం, ముళ్ల పొదలు తొలగించారు.