తెలంగాణ

telangana

ETV Bharat / state

మార్చిలో సీతారామ ప్రాజెక్ట్ డ్రై రన్: రజత్ కుమార్ - తెలంగాణ వార్తలు

సాగునీటి ప్రాజెక్ట్‌లను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ఫేస్ వన్ పంప్ హౌజ్‌ని సందర్శించారు. మార్చిలో డ్రై రన్ నిర్వహించే అవకాశాలున్నాయన్నారు.

irrigation-principal-secretary-rajath-kumar-and-cmo-secretary-smitha-sabarwal-visited-seetharama-project-in-bhadradri-kothagudem-district
మార్చిలో సీతారామ ప్రాజెక్ట్ డ్రై రన్: రజత్ కుమార్

By

Published : Jan 10, 2021, 5:49 PM IST

సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, జల వనరుల శాఖ అధికారి మురళీధర్ రావుతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని భీముని గుండం-కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు ఫేస్ వన్ పంప్ హౌజ్‌ని సందర్శించారు. నిర్మాణం పూర్తై డ్రై రన్‌కు సిద్ధంగా ఉన్న పంపులు, విద్యుత్ మోటార్లు, స్విచ్ యార్డుని పరిశీలించారు.

మార్చిలో సీతారామ ప్రాజెక్ట్ డ్రైరన్: రజత్ కుమార్

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తున్నామని రజత్ కుమార్ చెప్పారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కట్టుబడి ఉందన్నారు. సీతారామ ప్రాజెక్టు ఫేస్ వన్ పంప్ హౌజ్ నిర్మాణం పూర్తైందని... మిగిలినవి పురోగతిలో ఉన్నాయని తెలిపారు. అన్నింటి నిర్మాణం పూర్తయిన అనంతరం ఒకేసారి విద్యుత్ కనెక్షన్లు తీసుకొని డ్రై రన్‌కి ఏర్పాట్లు చేస్తామన్నారు. మార్చిలో డ్రై రన్ నిర్వహించే అవకాశాలున్నాయన్నారు.

రజత్ కుమార్, స్మితా సబర్వాల్, మురళీధరరావులు కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్టను సందర్శించారు. ఆనకట్ట వద్ద ప్రతిపాదిత హెలిప్యాడ్ నిర్మాణ ప్రదేశాన్ని, అక్కడి నుంచి సీతమ్మ సాగర్ నూతన ఆనకట్ట నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు. 2022 సెప్టెంబర్ కల్లా సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నందున భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

ఇదీ చదవండి:ఆకాశంలో హరివిల్లు.. లోగిళ్లలో ఈ రంగవళ్లులు

ABOUT THE AUTHOR

...view details