భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని మానస తుదిశ్వాస విడిచింది. ఇంటర్లో ఫెయిల్ అయ్యానని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్పటి నుంచి హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించటం వల్ల ఈరోజు ఉదయం కన్నుమూసింది. మానస మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇంటర్ బోర్డు నిర్వాకం వల్లే తమ బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి మరో విద్యార్థిని బలి - student
భద్రాద్రి జిల్లా వెంగన్నపాలెంలో ఆత్మహత్యయత్నం చేసిన ఇంటర్ విద్యార్థిని మానస తుదిశ్వాస విడిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందింది.
ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి మరో విద్యార్థిని బలి