తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇల్లందు తొలి మున్సిపల్​ ఛైర్మన్​ కన్నుమూత

ఇల్లందు తొలి మున్సిపల్​ ఛైర్మన్​ వై. వినయ్​ కుమార్​ ఇవాళ గుండెపోటుతో మరణించారు. సీపీఎం పార్టీ నుంచి పురపాలక సంఘం అధ్యక్ష పదవి చేపట్టిన తొలి, ఏకైక వ్యక్తిగా నిలిచారు.

ఇల్లందు తొలి మున్సిపల్​ ఛైర్మన్​ కన్నుమూత
ఇల్లందు తొలి మున్సిపల్​ ఛైర్మన్​ కన్నుమూత

By

Published : Jan 31, 2020, 7:41 PM IST

ఇల్లందు తొలి మున్సిపల్​ ఛైర్మన్​ కన్నుమూత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ మాజీ ఛైర్మన్ వై. వినయ్ కుమార్ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. 1985 లో పంచాయతీ నుంచి మున్సిపాలిటీ ఏర్పడిన ఇల్లందు పురపాలికలో మిత్రపక్షాల అభ్యర్థిగా తొలి ఛైర్మన్ పదవిని సీపీఎం పార్టీ తరఫున వినయ్​ కుమార్​ ప్రత్యక్ష పద్ధతిలో విజయం సాధించారు.

తొలి ఛైర్మన్​గా ఆయన ఇల్లందు పట్టణ అభివృద్ధికి విశేష కృషిని అందించారు. తన రాజకీయ ప్రస్థానంలో భాగంగా 2009లో కొంతకాలం ప్రజారాజ్యంలో ఉన్నారు. తర్వాత వినయ్​ కుమార్​.. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యునిగా కొనసాగారు. సీపీఎం పార్టీ నుంచి ఛైర్మన్​ పదవి పొందిన తొలి, ఏకైక వ్యక్తిగా నిలిచారు.

ఇవీ చూడండి:త్వరలో టీస్​బీపాస్​ తీసుకొస్తాం: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details