భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయ తలుపులను అర్చకులు, అధికారులు కలిసి మూసివేశారు. చద్రగ్రహణంతో ఆలయాన్ని మూసివేసినట్లు అర్చకులు తెలిపారు. తిరిగి రేపు ఉదయం ఐదు గంటలకు ఆలయ తలుపులు తెరచి సంప్రోక్షణ నిర్వహించి విగ్రహాలకు స్నపన తిరుమంజనం కావించి ఉదయం 8 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఆలయాన్ని మూసివేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న దుకాణాలు నిర్మానుష్యంగా మారాయి.
భద్రాద్రి రామయ్య ఆలయం మూసివేత - ramasita
చంద్రగ్రహణంతో తెలంగాణలోని ఆలయాలను అర్చకులు మూసివేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయాన్ని అర్చకులు, అధికారులు కలిసి మూసివేశారు. తిరిగి బుధవారం ఉదయం ఐదు గంటలకు ఆలయ తలుపులు తెరచి సంప్రోక్షణ నిర్వహిస్తారు.
తలుపుల మూస్తున్న అర్చకులు