తెలంగాణ

telangana

ETV Bharat / state

వాగు దాటాలంటే.. ప్రాణం పణంగా పెట్టాల్సిందే.. - తెలంగాణ తాజా వార్తలు

వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీ వాసులు కష్టాలు వర్ణణాతీతం. వాగులు ఉప్పొంగి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. చూస్తుండగానే ఉగ్రరూపం దాలుస్తూ.. ఏమాత్రం పట్టుతప్పినా ప్రాణాన్ని తీసుకుపోతుంది. బతుకు బండి నడవాలంటే వాగు దాటాల్సిన పరిస్థితిలో ప్రాణాలు పణంగా పెట్టి అవతలి ఒడ్డుకు వెళ్తున్నారు పినపాక నియోజకవర్గంలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు.

risk journy
risk journy

By

Published : Jul 13, 2021, 4:35 PM IST

Updated : Jul 13, 2021, 5:03 PM IST

కొన్ని రోజులుగు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మన్యంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కిన్నెరసాని వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మోదుగుల గూడెం, సజ్జలబోడు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

పంటపొలాలు, ఇతర గ్రామాలకు వెళ్లాలంటే ఆయా ప్రాంతాలవారు ఈ వాగు దాటడం తప్పనిసరి. ఈ ప్రాంతంలో వంతెన నిర్మించాలని ఏళ్లతరబడి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. మూడేళ్ల క్రితం ప్రతిపాదించిన వంతెన నిర్మాణం పూర్తికాలేదు. ఉద్ధృతంగా వస్తున్న నీటిలో బండరాళ్లపై కర్రలు ఏర్పాటు చేసి వృద్ధులను, మహిళలను వాగుదాటిస్తున్నారు స్థానికులు. ఏమాత్రం పట్టుతప్పినా గల్లంతయ్యే పరిస్థితి ఉంది. ఏళ్లతరబడి పడుతున్న తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయో తెలియని పరిస్థితి. కోట్లరూపాయలు పెట్టి అభివృద్ధి పనులు చేస్తున్నా... ఈ ప్రాంతంలో పనులు నత్తనడకన సాగుతున్నాయి.

వాగు దాటాలంటే.. ప్రాణం పణంగా పెట్టాల్సిందే..

ఇదీ చూడండి:Rescue: వాగులో చిక్కుకున్న కూలీలు... కాపాడిన యువకులు

Last Updated : Jul 13, 2021, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details