భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు అలుగు పోస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై నీరు చేరి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో రెండు గేట్లు పూర్తిగా ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
దారులన్నీ ఏరులై... పొలాలన్నీ నీటిపాలై.. - heavy rains in bhadradri kothagudem
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాలు నీట మునిగి రైతులకు అపార నష్టం మిగిల్చింది.
దారులన్నీ ఏరులై... పొలాలన్నీ నీటిపాలై..
నారాయణపురం, ఉట్లపల్లిలో పంట పొలాలు నీట మునిగాయి. వరద ఉద్ధృతికి షిరిడి సాయి కాలనీలో ఇంటి వద్ద ఉంచిన కారు కొట్టుకుపోయింది. బచ్చు వారి గూడేనికి చెందిన లక్ష్మణుడి... ఆరు పశువులు వరద నీటికి కొట్టుకుపోయాయి.
ఇదీ చూడండి:వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరంలో భారీ వర్షాలు