బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. అశ్వాపురం మండలంలోని పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇసుక వాగు, మేల వాగు, లోతు వాగులు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పొంగుతున్న వాగులు... నిలిచిపోయిన రాకపోకలు - పినపాక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
నిలిచిపోయిన రాకపోకలు