భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం అవసరాల కోసం ఏర్పాటు చేసే రైలు మార్గానికి భూమిని సేకరించేందుకు మణుగూరు మండలం రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఆర్.వో.ఎఫ్.ఆర్ కింద 4.5 ఎకరాల భూములను, 58 మంది రైతుల వివరాలను తహసీల్దార్ గ్రామ సభలో చదివి వినిపించారు. నిర్వాసితుల నివేదికలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరారు. జాబితాలో మరో ఏడుగురు రైతుల పేర్లు చేర్చాలని రైతులు కోరగా... పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ సభలో మణుగూరు ఎంపీపీ ఎడారి రమేష్ మాట్లాడుతూ... భద్రాద్రి థర్మల్ విద్యుత్ అవసరాల కోసం సేకరించిన భూమి వల్ల నష్టపోయే రైతులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
'భూమిని కోల్పోయే రైతులకు ఉద్యోగాలివ్వాలి' - BHUNIRVASITHULU
భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం అవసరాల కోసం ఏర్పాటు చేసే రైలు మార్గానికి భూమిని సేకరించేందుకు మణుగూరు మండలం రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించారు.
'భూమిని కోల్పోయే రైతులకు ఉద్యోగాలివ్వాలి'