'50 అడుగులకు చేరనున్న గోదావరి నీటిమట్టం'
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది.
ఎగువన కురిసిన వర్షాలకు గోదావరికి వరద ప్రవాహం పోటెత్తింది. నది పరివాహక ప్రాంతాలన్నీ నీటిలో చిక్కుకున్నాయి. పర్ణశాల వద్ద సీతమ్మ నారచీరల ప్రాంతం, స్నానఘట్టాలు, కల్యాణకట్ట ప్రాంతాలన్నీ వరదమయమయ్యాయి. భద్రాద్రి రామాలయ అన్నదాన సత్రం వద్ద మోకాళ్ల లోతు వరకు నీరు చేరింది. మోటార్లతో నీటిని గోదావరిలోకి ఎత్తిపోసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గోదావరిలో నీటిమట్టం 50 అడుగుల వరకు చేరే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గోదావరి ఉద్ధృతికి నీటమునిగిన ప్రాంతాల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.
- ఇదీ చూడండి : కేరళ: కుండపోత వర్షానికి చెరువులైన వీధులు