భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ఉద్ధృతి పెరగటం వల్ల గోదావరి నీటి మట్టం ఏకంగా 55.2 అడుగులకు చేరింది. ఇప్పటికే అధికారులు జారీ చేసిన మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తీర ప్రాంతాలతో పాటు ఎగువన కురుస్తోన్నభారీ వర్షాలతో గోదావరికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంత ప్రజలను, ఏజన్సీ ప్రాంత స్థానికులను అధికారులు ఇప్పటికే పునరావాస కేంద్రాలకు పంపించారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక - godavari flood news
godavari flood level increasing at badrachalam
15:56 August 21
భద్రాచలంలో గోదారి ఉగ్రరూపం... కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
Last Updated : Aug 21, 2020, 4:57 PM IST