భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు జలాశయం పరవళ్లు తొక్కుతోంది. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు జలాశయంలోకి చేరుతోంది. తాలిపేరు నుంచి 22 గేట్లను ఎత్తి ఒక లక్ష 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడం వల్ల జలాశయానికి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పరవళ్లు తొక్కుతున్న తాలిపేరు
తాలిపేరు జలాశయం పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు చేరడం వల్ల జలాశయం నిండు కుండను తలపిస్తోంది.
పరవళ్లు తొక్కుతున్న తాలిపేరు