Female Head Constable Died after Falling into Nala in Bhadrachalam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గత రెండు రోజులుగా జరుగుతోన్న గణేశ్ నిమజ్జనాలతో అక్కడ రద్దీ వాతావరణం నెలకొంది. కాగా నేడు మంత్రి కేటీఆర్(Minister KTR) పర్యటనతో భద్రతారీత్యా అక్కడ ఎక్కువ మంది పోలీసులు మోహరించారు. దీంతో కొత్తగూడెంలో పని చేస్తున్న శ్రీదేవి అనే హెడ్ కానిస్టేబుల్.. డ్యూటీ నిమిత్తం భద్రాచలం వచ్చారు. డ్యూటీ అనంతరం భద్రాద్రి రామయ్య సన్నిధికి వెళ్లి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని అన్నదాన సత్రంలో భోజనం చేసేందుకు అన్నదాన సత్రం వద్దకు వెళ్లారు.
ఈ క్రమంలోనే అన్నదాన సత్రం ఎదురుగా ఉన్నకాలువలో పడిపోయారు. ఉదయం కురిసిన భారీ వర్షం కారణంగా కాలువ నిండా నీళ్లు ఉండటంతో కాలువలో కొట్టుకుపోయారు. కొద్ది దూరం తర్వాత గోదావరి కలకత్తా స్లోయిజ్ల వద్ద మృతదేహం లభ్యమైంది. భద్రాచలంలో గత రెండు రోజులుగా జరుగుతున్న గణపతి నిమజ్జనాలు(Ganesh Nimajjanam 2023), ఈరోజు జరగనున్న కేటీఆర్ పర్యటన నేపథ్యంలో విధులు నిర్వహించేందుకు భద్రాచలం వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీదేవి మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Hyderabad Boy Nala death Case Update : బాచుపల్లి నాలాలో బాలుడు మృతి కేసు.. వారి నిర్లక్ష్యమే కారణం
A Man Died nimajjanam in Siddipet District :మరోవైవు వినాయక నిమజ్జనం చేస్తుండగా చెరువులో పడి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు కుమ్మరి కుంట చెరువులో గల్లి గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనానికి వెళ్లడాని తెలిపారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో శ్రీకాంత్ మృతదేహాన్ని వెలికి తీశారు. శ్రీకాంత్‌కు భార్య వనజతో పాటు సంవత్సరం కొడుకు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.