తెలంగాణ

telangana

ETV Bharat / state

తహసీల్దార్​పై రైతుల ఆగ్రహం.. - farmers fires on mro

భద్రాద్రి జిల్లా బూర్గంపాడులో రైతులకు, తహసీల్దార్​కు మధ్య ఇసుక వివాదం రాజుకుంటోంది. అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ రైతులు ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఫిర్యాదు చేశారు.

తహసీల్దార్​పై రైతుల ఆగ్రహం..

By

Published : Oct 17, 2019, 9:28 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఇసుక వివాదం రాజుకుంటోంది. కొందరు రైతులు ఎడ్ల బండ్లతో ఇసుక రవాణా చేశారంటూ ఆయా బండ్లను పోలీస్​స్టేషన్​కు తరలించారు తహసీల్దార్​. బండికి రూ.5000 జరిమానా చెల్లించాలని స్పష్టం చేశారు. ఎమ్మార్వోపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. ఎద్దులను తీసుకొచ్చి తహసీల్దార్​ కార్యాలయ ప్రాంగణంలో కట్టేశారు. తక్కువ ధరకే ఇసుక పంపిణీ చేస్తున్నామంటూ తమను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే రేగా కాంతారావుకు రైతులు ఫిర్యాదు చేశారు.

తహసీల్దార్​పై రైతుల ఆగ్రహం..

ABOUT THE AUTHOR

...view details