భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గంలోని 183 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి సామగ్రి అందించారు. అక్కడి నుంచి వారికి కేటాయించిన కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటున్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు గట్టి భద్రత ఏర్పాట్లు చేశామని పాల్వంచ డీఎస్పీ మధుసూదన రావు తెలిపారు. నియోజకవర్గంలో 412 మంది పోలీసులు భద్రత కోసం కేటాయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఈవీఎం, వీవీప్యాట్లతో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది - 412 POLICE
ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అశ్వారావుపేట నియోజకవర్గంలో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. దాదాపుగా అన్ని కేంద్రాలకు ఎన్నికల సామగ్రితో సిబ్బంది చేరుకుంటున్నారు.
ఎన్నికల సిబ్బందికి అందిన సామగ్రి