భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని హమాలీ బస్తీ సింగరేణి జేకే-5 నిర్వాసిత కాలనీలోని ఇళ్లు కూల్చేస్తున్న వేళ ఓ నిర్వాసితుడు ఆత్మహత్యకు యత్నించాడు. కాలనీలో నివాసముంటున్న గాదె లక్ష్మయ్య ఇల్లును సింగరేణి అధికారులు కూల్చేశారు. కరోనా సమయం కావటం వల్ల అద్దె ఇల్లు దొరక్కపోగా... సామగ్రితో రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మయ్య విషగుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు.
ఇల్లు కూల్చేశారన్న మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం - crime news
ఓ పక్క ఇల్లు కూల్చేశారు. మరో పక్క పరిహారం రాలేదు. ఇంకో పక్క అద్దెకు ఇల్లు కూడా దొరకలేదు. వీటన్నింటితో తీవ్ర మనస్తాపం చెందిన ఆ నిర్వాసితుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని హమాలీ బస్తీలో జరిగింది.
ఇల్లు కూల్చేశారన్న మనస్తాపంతో నిర్వాసితుని ఆత్మహత్యాయత్నం
స్థానికులు బాధితుడి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల ఖమ్మం తీసుకెళ్లారు. పరిహారం రాలేదని, కరోనా కావడం వల్ల ఇల్లు అద్దెకు దొరకదని, కొంత సమయం ఇవ్వాలని అధికారులను ప్రాధేయపడినా వినలేదని బాధితుని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.