స్థానికల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం - burgampadu
స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల లెక్కింపు కూడా భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్కిస్తున్నారు.
లెక్కింపు ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల, దుమ్ముగూడెంతోపాటు పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు, అశ్వాపురం మండలాల ఓట్ల లెక్కింపును ఇక్కడే కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచే పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్దకు ఆయా మండలాల నుంచి ఏజెంట్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు చేరుకున్నారు.