ధరణి పోర్టల్‌తో భూముల వివరాలను సులువుగా తెలుసుకోవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరు తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను జడ్పీటీసీ పోశం నరసింహారావుతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మొదలుపెట్టారు.
'రిజిస్ట్రేషన్ పూర్తయితే అరగంటలో కొత్త పాసుపుస్తకం' - మణుగూరులో ధరణి పోర్టల్ ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన అరగంటలో కొత్త పాసుపుస్తకం జారీ అవుతుందని పేర్కొన్నారు.
'రిజిస్ట్రేషన్ పూర్తయితే అరగంటలో కొత్త పాసుపుస్తకం'
ధరణి పోర్టల్ రైతులకు మంచి సౌలభ్యంగా ఉంటుందని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రజలకు వివరించారు. భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన అరగంటలో కొత్త పాసుపుస్తకం జారీ అవుతుందన్నారు. ప్రపంచంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ధరణి పోర్టల్‌ని ప్రభుత్వం రూపొందించిందని వెల్లడించారు.