DH Comments on MLA Vanama : ఎమ్మెల్యే వనమాపై డీహెచ్ సంచలన వ్యాఖ్యలు DH Srinivas Rao Comments on MLA Vanama : ఇటీవల తరచుగా వార్తల్లో ఉంటున్న రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు గడల శ్రీనివాస్‌రావు.. మరోసారి ప్రచారంలోకెక్కారు. ఈసారి నేరుగా అధికార పార్టీ ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించి.. చర్చనీయంగా మారారు. ప్రభుత్వ విధి నిర్వహణలో భాగంగా కరోనా పరిస్థితులు, వైద్య శాఖ పర్యవేక్షణతో పాటు తాయత్తులు, పూజలంటూ చేసిన ప్రసంగాలతో శ్రీనివాస్‌రావు గత కొన్నాళ్లుగా తరచుగా ప్రచారంలో ఉంటున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేందుకు సిద్ధమయ్యారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుండగా.. తాజాగా అక్కడి ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు స్థానికంగా అధికార పార్టీలో చిచ్చుపెట్టాయి.
ఇవీ చూడండి..
DH Srinivas Rao Comments on BRS MLA : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో పర్యటనలో భాగంగా.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో ఇదే చివరి పోటీ అని చెప్పిన స్థానిక శాసనసభ్యులు ఇక విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. లాస్ట్ ఛాన్స్ అంటూ.. ఇంకెన్ని ఛాన్స్‌లు అడుగుతారంటూ విమర్శించారు. ఈ క్రమంలోనే తన సమావేశానికి వచ్చే వారిని బెదిరిస్తున్నారని.. ప్రభుత్వ పథకాలు, దళిత బంధు వంటివి అందకుండా చేస్తామంటున్నారని ఆరోపించారు. ఇలాంటి తీరుకు ఎవరూ భయపడొద్దని సూచించారు. తనతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారా అని కార్యక్రమానికి వచ్చిన వారిని డీహెచ్ గడల శ్రీనివాస్‌రావు ప్రశ్నించారు.
''స్థానిక ప్రజాప్రతినిధి గారి వయస్సు ప్రస్తుతం 80 సంవత్సరాలు. మన కోసం ఎంతో చేశాడు. ఇక ఆయనను మనం కష్టపెట్టొద్దు. మన ఎమ్మెల్యేకు ఇక విశ్రాంతినిద్దాం. గత ఎన్నికల సమయంలో నాకు ఇవే చివరి ఎలక్షన్స్ అని ఆయన చెప్పారు. చివరగా ఒక్క ఛాన్స్ ఇవ్వండని కోరితే అవకాశం ఇచ్చాం. ఇలా ఇంకెన్ని ఛాన్స్‌లు ఇస్తాం. మనకూ బిడ్డలున్నారు. మన బిడ్డలూ ఉన్నత స్థానాలకు ఎదగాలి. నా కార్యక్రమానికి వచ్చే వారికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, దళిత బంధు వంటివి రాకుండా నిలిపివేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులు ఇంకెంత కాలం నడుస్తాయి. మనం అందరం కలిసి కట్టుగా ఉందాం. మన కష్టాలకు ఇక ఫుల్‌స్టాప్ పెడదాం.'' - గడల శ్రీనివాస్‌రావు, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు
ఇవీ చూడండి..