భద్రాద్రి శ్రీరామనవమి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచినవి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులతో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల కోసం వ్యాపారులు ముందస్తుగా సరుకులు కొనుగోలు చేసి నిలువ ఉంచారు.
భక్తులు లేక భద్రాద్రిలో కర్ఫ్యూ వాతావరణం
కరోనా ప్రభావంతో భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం మూసివేశారు. ఆలయ పరిసరాలు కర్ఫ్యూ వాతావరణాన్నితలపిస్తున్నాయి. భక్తులెవరూ లేకపోవడం వల్ల దుకాణాలు వెలవెలబోతున్నాయి.
భక్తులు లేక భద్రాద్రిలో కర్ఫ్యూ వాతావరణం
కరోనా ప్రభావంతో ఈసారి భద్రాచల సీతారాముల కల్యాణానికి భక్తులకు అనుమతివ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఆలయ పరిసరాల్లో భక్తుల జాడ లేకపోవడం వల్ల నిర్మానుష్యంగా ఉంది. శ్రీరామనవమి సందర్భంగా ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపారులు జోరుగా సాగేవి. ఇప్పటికే కరోనా ప్రభావంతో గత వారం రోజుల నుంచి వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారస్తులు వాపోతున్నారు.