భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 70 ఏళ్ల కరోనా బాధితుడు హల్చల్ చేశాడు. పట్టణానికి చెందిన వృద్ధునికి కరోనా సోకగా... మూడు రోజుల క్రితం ఇల్లందు నుంచి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వాతావరణంలో ఉండలేక ఆ వృద్ధుడు... ఆస్పత్రి నుంచి తప్పించుకొని ఇల్లందుకు చేరుకున్నాడు.
ఆస్పత్రి నుంచి మాయమైన కరోనా బాధితుడు - corona patient hulchal
కరోనా సోకిన ఓ వృద్ధున్ని ఆస్పత్రిలో పెట్టగా... ఆ వాతావరణం నచ్చని బాధితుడు తప్పించుకున్నాడు. ఇంకేముంది... విషయం తెలిసి వైద్య సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అంతా గాలించారు. చివరికి పట్టుకుని ఆస్పత్రికి తరలించారు.
corona-patient-absconded-from-kothagudem
బాధితుడు కన్పించటం లేదని తెలుసుకుని ఉరుకులు పరుగులు పెట్టటం వైద్య సిబ్బంది వంతైంది. అన్ని ప్రాంతాల్లో వెతుకుతుండగా... వృద్ధుడు ఇల్లందు బస్‌స్టాండ్‌లో ఉన్నాడని సమాచారం వచ్చింది. 108 సిబ్బంది హుటాహుటిన ఇల్లందు బస్టాండ్‌కు చేరుకొని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు కొత్తగూడెం నుంచి బస్సులో వచ్చిన విషయం తెలుసుకుని ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.