తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాభివృద్ధే సర్పంచుల ధ్యేయం - mpdo

కొత్తగా ఎన్నికైన సర్పంచులకు పాలనపై శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. భద్రాచలంలో చేపట్టిన తరగతులకు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఊరుని ఎలా అభివృద్ధి చేయాలో, నిధులను ఎలా ఉపయోగించుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించారు.

సర్పంచులకు శిక్షణ

By

Published : Feb 26, 2019, 4:09 PM IST

సర్పంచులకు శిక్షణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న నూతన సర్పంచుల శిక్షణ తరగతుల్లో కలెక్టర్ రజత్ ​కుమార్ సైనీ పాల్గొన్నారు. నూతన సర్పంచులు ఎలాంటి విధులు నిర్వర్తించాలి, సమస్యలేమైనా ఉంటే ఏ విధంగా ఫిర్యాదు చేయాలనే అంశాలను వివరించారు. సర్పంచులతో వారు తీసుకోనున్న నిర్ణయాలను అడిగి తెలుసుకున్నారు. అందరూ కలిసి గ్రామాభివృద్ధికై కృషి చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details