తెలంగాణ

telangana

ETV Bharat / state

బొగ్గు గనుల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల నిరసన - central policy on coal mines

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఎంఎస్​, ఐక్య కార్మిక సంఘాలు నిరసన బాట పట్టాయి. బొగ్గు గనుల ప్రైవేటీకరణతో కార్మికులు సంక్షోభానికి గురవుతారని కార్మిక సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

coal mine labour association leaders protest against central policy
బొగ్గు గనుల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల నిరసన

By

Published : May 18, 2020, 2:44 PM IST

బొగ్గు గనుల్లో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఎంఎస్, ఐక్య కార్మిక సంఘాలు నిరసన చేశాయి. బీఎంఎస్ సంఘం కార్యాలయంలో నాయకులు ఒక రోజు నిరసన దీక్ష చేశారు. బొగ్గు గనుల ప్రాంతాల్లో ఐక్య కార్మిక సంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బొగ్గు గనుల ప్రైవేటీకరణతో కార్మికులు సంక్షోభానికి గురవుతారని కార్మిక సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బొగ్గు గనులు, కార్మిక చట్టాలను కాపాడేందుకు కార్మికులు ఐక్యంగా పోరాడాలని నాయకులు సూచించారు.

బొగ్గు గనుల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల నిరసన

ఇదీ చదవండి:వలస కూలీలను ఫోన్​ నంబర్​తో పట్టేస్తారు

ABOUT THE AUTHOR

...view details