భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెదేపా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. నేడు బుర్గంపాడు, సారపాక గ్రామాల్లోని వరద బాధితులను పరామర్శించి....రేపు భద్రాద్రి రామయ్యను దర్శించుకోనున్నారు. అనంతరం భద్రాచలంలో ముంపునకు గురైన వరద బాధితుల ఇండ్లకు వెళ్లి పరామర్శించనున్నారు. 2014లో భద్రాచలం వచ్చిన చంద్రబాబు మళ్లీ 8 ఏళ్ల తర్వాత భద్రాచలం రావడంతో తెదేపా శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
8 ఏళ్ల తర్వాత భద్రాచలానికి చంద్రబాబు.. శ్రేణుల్లో ఆనందం - Chandrababu tour in badrachalam district
దాదాపు 8 ఏళ్ల తర్వాత తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు భద్రాచలంలో అడుగు పెట్టారు. దీనితో తెదేపా శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటిస్తోన్న చంద్రబాబు... వరద బాధితులను పరామర్శించి.. రేపు రామయ్యను దర్శించుకోనున్నారు.
Chandrababu tour in badrachalam district
ఇటీవల తెలంగాణలో కురిసిన వర్షాలకు.. భద్రాద్రిలో చాలా మంది జీవితాలు ఆగమయ్యాయి. చాలామందికి కనీసం గూడు లేకుండా పోయింది. వారిని చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు.
-ఇవీ చూడండి: