తెలంగాణ

telangana

ETV Bharat / state

బీటీపీఎస్​ రెండో యూనిట్​ బాయిలర్​ లైటప్​ విజయవంతం - భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం

బీటీపీఎస్ రెండో యూనిట్ బాయిలర్ లైట్ విజయవంతమైంది. ఈ విజయం పట్ల జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు చరవాణిలో జెన్కో, భెల్ అధికారులకు అభినందనలు తెలిపారు. డిసెంబర్​లోగా సింక్రనైజేషన్​ ప్రక్రియ పూర్తి చేస్తామని జెన్కో డైరెక్టర్​ సచ్చిదానందం వెల్లడించారు.

BTPS Second Unit Boiler Lightup Successful

By

Published : Oct 19, 2019, 11:32 PM IST

భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో డిసెంబర్​లోగా 3 యూనిట్లు సింక్రనైజేషన్ పూర్తి చేస్తామని జెన్కో డైరెక్టర్ సచ్చిదానందం వెల్లడించారు. బీటీపీఎస్​ రెండో యూనిట్ బాయిలర్ లైటప్​ను సచ్చిదానందం శనివారం స్విచాన్ చేశారు. తొలుత రెండో యూనిట్ బాయిలర్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. లైటప్ ప్రారంభించిన వెంటనే బాయిలర్ ఒకటి, మూడు గొట్టాల నుంచి మంట వెలువడింది. చిమ్నీ నుంచి పొగ బయటకు వచ్చింది. లైట్ విజయవంతం కావటంతో జెన్కో, భేల్ అధికారులను, ఇంజినీర్లను డైరెక్టర్ అభినందించారు. రెండో యూనిట్ బాయిలర్ లైటప్ పూర్తయినందున స్ట్రీమ్ బ్లోయింగ్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి లోపు 1080 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు యూనిట్ల నిర్మాణాలు పూర్తి చేసి సీఓడీ చేస్తామని స్పష్టం చేసారు. బీపీఎస్ నిర్మాణం పనులు ఒక్కో దశ పూర్తి కావడంలో జెన్కో, భెల్ అధికారుల కృషి ఉందని కొనియాడారు.

బీటీపీఎస్​ రెండో యూనిట్​ బాయిలర్​ లైటప్​ విజయవంతం

ABOUT THE AUTHOR

...view details