తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రి రామాలయంలో ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రామాలయంలో భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు.

Bhishma Ekadasi Ceremonies in bhadrachalam rama temple
భద్రాద్రి రామాలయంలో ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు

By

Published : Feb 5, 2020, 1:20 PM IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలోని లక్ష్మణసమేత సీతారాములకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని ప్రధాన ఆలయంలోని రామయ్యకి ఏకాంత అభిషేకం నిర్వహించారు.

ప్రాకార మండపంలో నిత్య కళ్యాణ మూర్తులకు పంచామృతాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం వెండి రథ సేవ, తిరువీధి సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు విజయ రాఘవులు తెలిపారు.

భద్రాద్రి రామాలయంలో ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు

ఇదీ చూడండి: మేడారం జాతరలో ఉచితంగా బట్టలు ఉతికిస్తారండోయ్..

ABOUT THE AUTHOR

...view details