తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రిలో రామదాసు జయంత్యుత్సవాలు - RAMALAYAM

భద్రాచలంలో రామయ్య గుడి కట్టిన భక్త రామదాసు 386 జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో ఆ రామదాసుకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

భద్రాద్రిలో రామదాసు జయంత్యుత్సవాలు

By

Published : Feb 8, 2019, 3:08 PM IST

RAMADASU
భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ భక్త రామదాసు 386 జయంత్యుత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఐదు రోజుల పాటు సాగే ఈ ఉత్సవ కార్యక్రమాలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించనున్నారు. నేడు మొదటి రోజు కావడంతో శ్రీ భక్త రామదాసు చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. రామాలయంలో ఉన్న భక్త రామదాసు విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రారంభమైన వాగ్గేయకారోత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి గాయనీ గాయకులు, సంగీత విద్వాంసులు భద్రాచలం చేరుకున్నారు. ఈ నెల 12వ తేదీ వరకు చిత్రకూట మండపంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details