రాష్ట్రంలో ప్రాచీన పుణ్యక్షేత్రమైన భద్రాచల రామయ్యపై విమర్శలు చేయడాన్ని నూతనంగా ఏర్పాటైన ఆలయ జేఏసీ ఖండించింది. దేవాలయ సంప్రదాయాలకు, అర్చక సిబ్బందికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. శ్రీ భద్రాచల రామ మహాసేన పేరుతో ఆవిర్భవించిన జేఏసీకి కమలేష్ మహారాజ్ స్వామీజీ అధ్యక్షుడిగా, గంగు ఉపేంద్ర శర్మ కన్వీనర్‌గా, భాష్యం యదుమోహన్ ఆచార్య కో-కన్వీనర్‌గా, ఆనంద్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా, భక్త రామదాసు వారసులు కంచర్ల శ్రీనివాసరావును కోశాధికారిగా ఎన్నుకున్నారు.
'దేవాలయాలపై విమర్శలు చేసేవారికి కనువిప్పు కలిగిస్తాం' - భద్రాద్రి కొత్తగూడెం వార్తలు
ప్రాచీన సంప్రదాయాలపై, దేవాలయాలపై విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నూతనంగా ఏర్పాటైన భద్రాచల ఆలయ జేఏసీ ప్రకటించింది. ఆలయాలపై, స్వాములపై సామాజిక మాధ్యమాల్లో కించపరిచేలా పోస్టులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
భద్రాచల రామయ్య నూతన జేఏసీ ఆవిర్భావం
కొత్తగా ఏర్పాటైన జేఏసీలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆలయ ఆగమ సంప్రదాయాలను విమర్శించరాదని, దేవాలయ ట్రస్ట్ బోర్డులో పెద్దలు ఒక్కరైనా సభ్యుడిగా ఉండి.. సంప్రదాయాన్ని కాపాడే ప్రయత్నం జరగాలని వక్తలు తెలిపారు. ఈ జేఏసీ ద్వారా ఒక పటిష్ఠమైన ఆలయ ఆగమ వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జేఏసీ నేతలు తీర్మానం చేశారు.