చిన్న చిన్న వివాదాలకు కోర్టుల చుట్టు తిరుగుతున్న కక్షిదారులు తమ కేసులను లోక్ అదాలత్‌ల ద్వారా పరిష్కరించుకోవాలని భద్రాచలం జ్యుడిషియల్ ఫాస్ట్రాక్ కోర్టు మెజిస్ట్రేట్ సురేష్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 200 కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు.
'లోక్ అదాలత్‌ల ద్వారా కేసుల సత్వర పరిష్కారం'
ప్రతి చిన్న వివాదానికి న్యాయస్థానాలను ఆశ్రయించకుండా ప్రజలు లోక్ అదాలత్‌ల ద్వారా తమ కేసులను పరిష్కరించుకోవాలని భద్రాచలం జ్యుడిషియల్ ఫాస్ట్రాక్ కోర్టు మెజిస్ట్రేట్ సురేష్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులను పరిష్కరించామని ఆయన తెలిపారు.
భద్రాద్రి జిల్లాలో లోక్ అదాలత్
లోక్ అదాలత్‌ల ద్వారా ప్రజలు సత్వర న్యాయం లభిస్తుందని మెజిస్ట్రేట్ సురేష్ కుమార్ తెలిపారు. శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌కు సూదూర ప్రాంతాల నుంచి వచ్చిన కక్షిదారుల కోసం త్రాగునీరు, పులిహోరను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం మండల లీగల్ సర్వీస్ ఛైర్మన్ సురేష్ కుమార్ కుమార్, ఏపీపీ సాంబ దుర్గబాయి, లోక్ అదాలత్ మెంబర్ పడిసిరి శ్రీనివాస్, బార్ అధ్యక్షులు ఎన్ వీ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.