భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. ఆస్పత్రిలోని వార్డులు తిరిగారు. జ్వరంతో బాధపడుతున్న బాధితులను పరామర్శించారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. వైద్యులకు సూచనలు, సలహాలు అందించారు. హైదరాబాద్లో ఏ విధంగా అయితే వైద్య సేవలు అందుతున్నాయో ఏజెన్సీ ప్రాంతంలోని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో అదే విధంగా చికిత్స అందుతుందన్నారు. ఇక్కడ వైద్యం చేసేందుకు వైద్యులు తక్కువ సంఖ్యలో వస్తున్నారని తద్వారా కొంచెం వైద్యుల కొరత ఉందని అన్నారు.
మెరుగైన వైద్యం అందిస్తున్నాం: ఈటల - eetala rajender
రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని సందర్శించారు.
పెషేంట్లను అడిగి తెలుసుకుంటున్న ఈటల