కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తోన్న వైద్య సిబ్బంది సేవలు మరువలేనివని ఎమ్మెల్యే పొదెం వీరయ్య కొనియాడారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం మిట్టపల్లిలోని ఏఎన్ఎం, ఆశా వర్కర్లను ఆయన ఘనంగా సన్మానించారు.
'కరోనా సంక్షోభంలో.. వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి' - Tribute to Asha workers
కరోనాపై పోరాటంలో ప్రజలను కాపాడుతూ, వారిలో మనోధైర్యాన్ని నింపుతున్న వైద్య సిబ్బంది రుణం తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం మిట్టపల్లిలోని ఏఎన్ఎం, ఆశా వర్కర్లను ఆయన ఘనంగా సన్మానించారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించి మహమ్మారిని తరిమికొట్టేందుకు సహకరించాలని కోరారు.
MLA Podem Veeraiah
అనంతరం గ్రామంలోని పలువురు కొవిడ్ బాధితులను ఎమ్మెల్యే పరామర్శించారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించి మహమ్మారిని తరిమికొట్టేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి వెంకటేశ్వర్లు, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:JOURNALIST RAGHU: జైలు నుంచి బెయిల్పై విడుదలైన జర్నలిస్టు రఘు