భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరంతర పరిసర గాలి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ కేంద్రాన్ని.. సింగరేణి ఇల్లందు ఏరియా జీఎం సత్యనారాయణ ప్రారంభించారు. కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశానుసారం ఉపరితల గనుల ప్రాంతాలలో దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సింగరేణి ఇల్లందు ఏరియా ఆధ్వర్యంలో గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రం - తెలంగాణ వార్తలు
గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాన్ని ఉపరితల గనుల ప్రాంతాలలో ఏర్పాటు చేసినట్లు సింగరేణి ఇల్లందు ఏరియా జీఎం సత్యనారాయణ తెలిపారు. గాలి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సంకేతాలను సెంట్రల్ పొల్యూషన్ బోర్డుకు పంపిస్తుందని వెల్లడించారు.
సింగరేణి ఇల్లందు ఏరియా ఆధ్వర్యంలో గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రం
వాతావరణంలోని గాలి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ... ఎప్పటికప్పుడు సంకేతాలను సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్‌కు పంపిస్తుందని వెల్లడించారు. రూ.48 లక్షల వ్యయంతో దీనిని నిర్మించినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం బండి వెంకటయ్య, ప్రాజెక్ట్ ఇంజినీర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.