తినడానికి తిండి దొరక్క కొందరు బాధపడుతుంటే.. జీవితం గడవడమే గగనమనుకుంటే.. ఓ వ్యక్తి తాగడానికి మద్యం లేదని గొంతు కోసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన మర్రివాడ రాంబాబు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లో కార్పెంటర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. కరోనా భయంతో సొంతూరుకొచ్చాడు.
మద్యం దొరక్క ఆత్మహత్యాయత్నం
తాగుడు ఎంతో ప్రమాదమో మరోసారి నిరూపితమైంది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి అది దొరక్కపోవడం వల్ల పిచ్చెక్కిపోయి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో చోటుచేసుకుంది.
మద్యం దొరక్క ఆత్మహత్యాయత్నం
మద్యానికి బానిసైన అతను రోజుల తరబడి మద్యం దొరక్క పోవటంతో పిచ్చెక్కిన వాడిలా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో వారు నిద్రిస్తున్న సమయంలో చాకుతో రెండుసార్లు గొంతు కోసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు బాధితుడిని అశ్వరావుపేట ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి:కరోనాపై పోరాటానికి విరాళాల వెల్లువ