భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణం సుందరయ్యనగర్ కాలనీకి చెందిన ఫరీదా భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు పిల్లలుండగా... వీరిలో చిన్నవాడైన సాదిక్ రెండేళ్లుగా గుండె వ్యాధితో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్య చేయించే స్థోమత లేని ఆ కుటుంబం.... స్థానికంగానే చూపించింది.
ఈ బాధ ఏ తల్లికి రావొద్దు.. రిక్షాపై తీసుకెళ్లి అంత్యక్రియలు - కన్నీటి గాధ
కటిక పేదరికం ఓ ఇంట తీరని విషాదం నింపింది. కరోనా వైరస్ ఆ బాధను వెయ్యింతలు చేసింది. కంటికి రెప్పలా కాపాడుకున్న బిడ్డ కడుపేదరికంతో దూరం కాగా... లోకాన్ని వీడిన బిడ్డ మహమ్మారి కారణంగా గౌరవంగా సాగనంపలేకపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన చూపరుల హృదయాన్ని ద్రవింపచేస్తోంది.
కటికి దారిద్య్రంలో కన్నబిడ్డకు కన్నీటి వీడ్కోలు
ఇటీవల బాబు ఆరోగ్యం మరింత క్షీణించగా..... ఏమిచేయలేని ఆ తల్లి దేవునిపై భారం వేసింది. నిన్నరాత్రి సాదిక్ మృతిచెందగా... అంత్యక్రియలు చేయటం కూడా వారికి భారంగా మారింది. సాదిక్ మృతదేహాన్ని తన తాత రిక్షాలో తీసుకువెళ్లి.... గోదావరి పక్కన అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా మహమ్మారి కారణంగా అంత్యక్రియలకు బంధువులు కూడా ఎవరూ హాజరుకాకపోవటంతో ఫరీదా, తన మామతో కలిసి కుమారుడి అంత్యక్రియలు నిర్వహించింది.
ఇదీ చూడండి:దయచేసి మమ్మల్ని మా రాష్ట్రానికి చేర్చండి సారూ...!
Last Updated : May 11, 2020, 6:41 PM IST