ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామం. దేశాన్ని రక్షించేందుకు ఎప్పుడూ ముందుంటుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 46 మంది యువకులు ఈ ఊరి నుంచి దేశ సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు.
ఎందుకు చేరారంటే!
అక్కడ గ్రామంలోని యువతకు చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరాలనే ఆసక్తి ఉండేది. అందుకే పదో తరగతి పూర్తికాగానే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొని దేశ సేవకు ఎంపికయ్యారు.
ఒక్క కొడుకు ఉన్నా సైన్యంలోకే..
ఒక్క కొడుకు ఉన్న తల్లిదండ్రులు ఐదుగురు ఉన్నారు. ఇద్దరు కొడుకులు ఉన్నా.. ఆ ఇద్దరు ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తున్నవారు నర్సాపూర్ గ్రామంలో ఉన్నారు. దేశ రక్షణకై అహోరాత్రులు శ్రమిస్తూ.. అర్ధరాత్రి వరకు సరిహద్దు ప్రాంతాల్లో సేవలను అందిస్తున్నారు.